హైదరాబాద్‌లో కల్తీ కల్లు కలకలం .. 69 కాంపౌండ్లు సీజ్

Update: 2023-11-03 11:17 GMT

హైదరాబాద్‌ నగరంలోని కల్లు కంపౌండ్లపై నార్కోటిక్ బ్యూరో అధికారులు భారీ స్థాయిలో దాడులు చేస్తున్నారు. కల్తీ కల్లును తయారు చేసి అమ్ముతున్న 69 కల్లు కాంపౌండ్లను సీజ్ చేశారు. కల్తీ కల్లుపై ఫిర్యాదు రావడంతో శుక్రవారం అధికారులు దాడులు చేరారు. మినప్పిండి, అల్ఫాజోలం, నిమ్మ ఉప్పు తదితర పదార్థాలతో కృత్రిమ కల్లు తయారు చేసి అమ్ముతున్నట్లు తేలింది. కాంపౌండ్ల నుంచి కల్లు శాంపిళ్లను సేకరించి పరీక్షల కోసం లేబొరేటరీకి పంపామని పోలీసులు చెప్పారు. నగరంలో కల్లు వినియోగం ఎక్కువగా ఉండడంతో సప్లై తగ్గి అక్రమాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. కల్తీ కల్లు నిరోధానికి పోలీసులు, నార్కోటిక్స్ విభాగం ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా పలితం ఉండల్లేదు.


Tags:    

Similar News