ఎమ్మెల్సీ కవిత అరెస్ట్‌పై.. క్లారిటీ ఇచ్చిన అడ్వొకేట్

Byline :  Vamshi
Update: 2024-03-15 11:50 GMT

బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇంట్లో ఈడీ, ఐడీ సోదాలు ఆమె అరెస్ట్ అంటూ జరుగుతున్న ప్రచారంపై అడ్వొకేట్ సోమా భరత్ స్పందించారు. ప్రస్తుత పరిస్థితిలో కవితని అరెస్ట్ చేసే అవకాశం లేదని ఆయన క్లారిటీ ఇచ్చారు. సోదాలు పూర్తియ్యేంత వరుకు నన్ను ఇంట్లో అనుమంతించలేమని అధికారులు చెపారని భరత్ పేర్కొన్నారు.. ప్రస్తుతం కవిత కేసు సుప్రీంకోర్టులో ఉందని, ఈ నెల 19న కేసు విచారణ ఉందని తెలిపారు. అప్పటి వరకు ఎలాంటి చర్యలు ఉండవని సుప్రీంకోర్టుకు కూడా ఈడీ చెప్పిందని వెల్లడించారు. కవితను కలవడానికి వెళితే లోపలికి అనుమతించలేదన్నారు.

కేసు పెండింగ్‌లో ఉన్నందున అధికారులు ఎందుకు వచ్చారో తెలియాల్సి ఉందన్నారు. తీర్పు వచ్చే వరకు మాత్రం ఎలాంటి చర్యలు ఉండవని ఈడీ స్పష్టం చేసిందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆమెను అరెస్ట్ చేసే అవకాశం లేదని తెలిపారు. ఈడీ అధికారులు బయటకు వచ్చాక గానీ ఏమీ చెప్పలేమన్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన 10 మంది అధికారుల బృందం హైదరాబాద్‌లోని ఆమె ఇంట్లో తనీఖీలు చేస్తొంది. కవితతో పాటు ఆమె భర్త వ్యాపారులపై అధికారులు ఆరా తీస్తున్నారు.ఆమె ఇంట్లోకి ఎవరిని అనుమతించడం లేదు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించి దాడులు జరుగుతున్నాయని తెలుస్తొంది. సోదాల నేపధ్యంలో కవిత ఇంటి వద్ద పోలీసులు మోహరించారు.

Tags:    

Similar News