ముగిసిన దావోస్ టూర్.. లండన్ చేరుకున్న రేవంత్ రెడ్డి

By :  Krishna
Update: 2024-01-18 15:57 GMT

సీఎం రేవంత్ రెడ్డి దావోస్ టూర్ ముగిసింది. దావోస్లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో రేవంత్ పాల్గొన్నారు. వివిధ సంస్థల ప్రతినిధులతో సమావేశమై తెలంగాణలో పెట్టుబడులపై చర్చించారు. వెబ్ వర్క్స్, అదానీ గ్రూప్, గోడీ ఇండియా, గోద్రేజ్, టాటా గ్రూప్ వంటి సంస్థలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి. దావోస్ పర్యటన ముగియడంతో రేవంత్ లండన్ చేరుకున్నారు. లండన్లో ఆయనకు ఘన స్వాగతం లభించింది. లండన్లో పలువురు ఇన్వేస్టర్లతో సమావేశమవుతారు. రాష్ట్రంలో పెట్టుబడులపై చర్చిస్తారు. అదేవిధంగా ఎన్ఆర్ఐలతో రేవంత్ సమావేశమవుతారు.

అంతకుముందు రేవంత్ వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో భాగంగా ఫుడ్ సిస్టం అండ్ లోకల్ యాక్షన్ అంశంపై ప్రసంగించారు. రైతులకు ప్రపంచమంతా అండగా నిలవాలని కోరారు. అన్నదాతలకు కార్పొరేట్‌ తరహా లాభాలు వస్తే ఆత్మహత్యలు అనేవే ఉండవని చెప్పారు. ప్రస్తుతం ఇండియాలో వ్యవసాయం తీవ్ర సంక్షోభంలో ఉందని వ్యాఖ్యానించారు. సరైన లాభాలు రాక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. రైతులను ఆదుకునేందుకు తమ ప్రభుత్వం రైతు భరోసా పథకం అమలు చేస్తున్నట్లు చెప్పారు.


Tags:    

Similar News