పార్లమెంట్ కో ఆర్డినేటర్లను నియమించిన కాంగ్రెస్

By :  Krishna
Update: 2024-01-07 14:23 GMT

పార్లమెంట్ ఎన్నికలు దగ్గరపడుతుండడంతో కాంగ్రెస్ దూకుడు పెంచింది. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తోంది. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో తెలంగాణలో మినహా మిగితా చోట్ల సత్తా చాటలేకపోయింది. దీంతో ఈ సారి ప్రణాళికలకు మరింత పదును పెడుతోంది. ఈ క్రమంలో తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు పార్లమెంట్ కో ఆర్డినేటర్లను ప్రకటించింది. ఏపీ, తెలంగాణ, గుజరాత్, బిహార్,అస్సాం, ఛత్తీస్‌గఢ్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పంజాబ్ అరుణాచల్ ప్రదేశ్,గోవా సహా పలు రాష్ట్రాల్లోని పార్లమెంట్ నియోజకవర్గాలకు కో ఆర్డినేటర్లను నియమించింది.

అదిలాబాద్ - సీతక్క

పెద్దపల్లి - శ్రీధర్ బాబు

కరీంనగర్ - పొన్నం ప్రభాకర్

నిజామాబాద్ - జీవన్ రెడ్డి

జహీరాబాద్ - సుదర్శన్ రెడ్డి

మెదక్ - దామోదర రాజనరసింహా

మల్కాజిగిరి - తుమ్మల నాగేశ్వరరావు

సికింద్రాబాద్ - భట్టి విక్రమార్క

హైదరాబాద్ - భట్టి విక్రమార్క

చేవేళ్ల - రేవంత్ రెడ్డి

మహబూబ్ నగర్ - రేవంత్ రెడ్డి

నాగర్ కర్నూల్ - జూపల్లి కృష్ణారావు,

నల్గొండ - ఉత్తమ్ కుమార్ రెడ్డి

భువనగిరి - కోమటిరెడ్డి వెంకటరెడ్డి

వరంగల్ - కొండా సురేఖ

మహబూబాబాద్ - పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

ఖమ్మం - పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి


Tags:    

Similar News