కాంగ్రెస్ నేతల నిరీక్షణకు తెరపడనుంది. ఎట్టకేలకు పార్టీ అభ్యర్థుల తొలి జాబితా సిద్ధమైంది. 58 మంది పేర్లతో కాంగ్రెస్ ఫస్ట్ లిస్టును ఆదివారం ప్రకటిస్తామని స్క్రీనింగ్ కమిటీ ఛైర్మన్ మురళీధరన్ చెప్పారు. మరో రెండు రోజుల్లో మిగతా స్థానాల్లో బరిలో నిలిపే అభ్యర్థుల పేర్లను వెల్లడిస్తామన్నారు. లెఫ్ట్ పార్టీలకు సీట్ల కేటాయింపుపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఆయన స్పష్టం చేశారు. కమ్యూనిస్టులకు కేటాయించే సీట్లపై త్వరలోనే స్పష్టత వస్తుందని మురళీధరన్ చెప్పారు.