సీఎం రేవంత్ రెడ్డి తమపై చాలా పెద్ద ఆరోపణలు చేశారని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ అన్నారు. ఎంఐఎం బీజేపీ బీ టీం అన్న ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. కావాలంటే ప్రాణాలైనా విడుస్తామేతప్ప బీజేపీతో కలవమని స్పష్టం చేశారు. ముస్లింల హక్కుల కోసమే తాము పోరాడామని, రాష్ట్ర అభివృద్ధికి తమ వంతు కృషి చేసేందుకు సిద్ధమని అక్బరుద్దీన్ ప్రకటించారు.
అజారుద్దీన్ ఓటమి గురించి మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి.. బాబా సాహెబ్ అంబేడ్కర్ను ఎవరు ఓడించారో చెప్పాలని అక్బరుద్దీన్ డిమాండ్ చేశారు. ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు ఇచ్చినప్పుడు రేవంత్ కాంగ్రెస్ లో లేదని అన్నారు. అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డితో కలిసి రాజశేఖర్ రెడ్డితో కలిసి 4 శాతం రిజర్వేషన్లు సాధించుకున్నారని, ఆయనను జన్మలో మర్చిపోలేమని చెప్పారు. రిజర్వేషన్ల సాధనలో షబ్బీర్ అలీ కూడా భాగస్వామి అని అక్బరుద్దీన్ గుర్తు చేశారు. బీఆర్ఎస్ పార్టీని తాము వెనకేసుకురావడం లేదని అక్బరుద్దీన్ అన్నారు. తమ గురించి తాము మాట్లాడుకునే సామర్థ్యం బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం పార్టీలకు ఉందని చెప్పారు.