ఓటర్లను దేవుళ్లుగా కొలుస్తున్న అభ్యర్థులు.. ఖర్చంతా వారిదే

By :  Bharath
Update: 2023-11-29 02:22 GMT

ఓట్ల పండుగ వచ్చేసింది. మహా నగరం దాదాపు ఖాళీ అయింది. ఉపాధి, ఉద్యోగరీత్యా హైదరాబాద్ సహా ఇతర ప్రాంతాలకు వెళ్లినవారంతా తమ సొంతూళ్లకు బయలుదేరారు. ప్రభుత్వం కూడా సెలవు ప్రకటించింది. వీకెండ్ కూడా కావడంతో చాలామంది ఊళ్లకు బయలుదేరారు. దూర ప్రాంతాల్లో ఉన్న మరికొంతమంది ఇళ్లకు వెళ్లలేక సిటీల్లోనే ఉండిపోయారు. ఈ క్రమంలో ఎలక్షన్ లో నిలబడ్డ అభ్యర్థులు రంగంలోకి దిగారు. ఒక్క ఓటు కూడా చేజారిపోకూడదనే లక్ష్యంగా ప్లాన్ చేస్తున్నారు. గ్రామస్థాయి కేడర్ ను ఇతర ప్రాంతాల్లోని ఓటర్లకు ఫోన్లు చేయించి పిలిపించాలని అభ్యర్థుల ఆదేశాల జారీ చేస్తున్నారు. రానుపోను ఖర్చులతో పాటు మిగతా ఖర్చు ఎంతైనా భరించేందుకు సిద్ధమయ్యారు. కచ్చితంగా ఓటు తమకే పడుతుందనుకున్న వారి అకౌంట్లలో ఇప్పటికే డబ్బు జమ చేసినట్లు తెలుస్తోంది. పోలింగ్ రోజు రావడానికి కావాల్సిన ప్రయాణ సదుపాయాలు కూడా కొంతమంది ఏర్పాటుచేస్తున్నారు. ఎన్నికల వేడి దృష్ట్యా ఈసారి గ్రామీణ ప్రాంతాల్లో ఓటింగ్ శాతం పెరిగే అవకాశం ఉంది.

Tags:    

Similar News