సీఎం రేవంత్ను కలిసిన అమరరాజా కంపెనీ ఎండీ

Update: 2024-01-03 12:37 GMT

సీఎం రేవంత్ రెడ్డితో అమరరాజా కంపెనీ ఎండీ గల్లా జయదేవ్ భేటీ అయ్యారు. మహబూబ్ నగర్ జిల్లా దివిటిపల్లిలో ఏర్పాటు చేస్తున్న అమరరాజా గిగా కారిడార్‌పై చర్చించారు. సుమారు రూ.9500 కోట్ల పెట్టుబడితో దేశంలోనే అతి పెద్దదైన లిథియం అయాన్ బ్యాటరీ ఫ్యాక్టరీని అమరరాజా గ్రూప్ నెలకొల్పుతోంది. దీన్ని పురోగతిపై ఐటీ మంత్రి శ్రీధర్ బాబు, సీఎం రేవంత్తో కంపెనీ ఎండీ చర్చలు జరిపారు.

అమరరాజా కంపెనీకి ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుందని రేవంత్ స్పష్టం చేశారు. రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధిలో అమరరాజా కంపెనీది కీలక పాత్ర అన్నారు. శుద్ధ ఇంధనం ఉత్పత్తికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని.. అధునాతన సాంకేతికతను ఉపయోగించే కంపెనీలకు ప్రోత్సాహం ఉంటుందని తెలిపారు. కాగా గిగా కారిడార్‌కు ప్రభుత్వం ఇస్తోన్న సహకారం అభినందనీయమని గల్లా జయదేవ్ అన్నారు. తమ ప్రాజెక్టు త్వరితగతిన పూర్తయ్యేందుకు ప్రభుత్వం సహకరిస్తోందని చెప్పారు. రానున్న రోజుల్లో తమ వ్యాపారాలను మరింత విస్తరిస్తామని చెప్పారు.

Tags:    

Similar News