Telangana BJP: జోరు పెంచిన బీజేపీ.. రేపు మరోసారి తెలంగాణకు అమిత్ షా..
కేంద్ర హోం మంత్రి అమిత్ షా మంగళవారం మరోసారి తెలంగాణకు రానున్నారు. మధ్యాహ్నం ఆదిలాబాద్ డైట్ కాలేజీ గ్రౌండ్స్లో జరిగే బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. ఈ నెల 1న మహబూబ్ నగర్ వేదికగా ప్రధాని నరేంద్రమోడీ ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. దానికి కొనసాగింపుగా 3న నిజామాబాద్ లో బీజేపీ సభ నిర్వహించగా.. తాజాగా ఆదిలాబాద్లో పబ్లిక్ మీటింగ్ ఏర్పాటు చేశారు.
ఆదిలాబాద్ సభ అనంతరం సాయంత్రం శంషాబాద్ లోనూ బీజేపీ మరో సభ నిర్వహించాలని తొలుత భావించింది. అయితే అది రద్దుకావడంతో సికింద్రాబాద్ సిఖ్ విలేజ్ లోని ఇంపీరియల్ గార్డెన్ లో నిర్వహించే మేధావుల సభలో అమిత్ షా పాల్గొంటారు. అనంతరం రాత్రి బీజేపీ రాష్ట్ర ముఖ్య నేతలతో సమావేశమై రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిణామాలు. పరిస్థితులపై చర్చించే అవకాశం ఉంది.
అమిత్ షా షెడ్యూల్:
అమిత్ షా మధ్యాహ్నం 1.45 కు బేగంపేట ఎయిర్పోర్ట్‌కు చేరుకుంటారు.
మ. 2.35కు ప్రత్యేక హెలికాప్టర్లో ఆదిలాబాద్కు బయలుదేరుతారు
మ. 3 నుంచి 4 గంటల వరకు ఆదిలాబాద్ సభలో పాల్గొంటారు.
మ. 4.15 కు ఆదిలాబాద్ నుంచి బేగంపేట ఎయిర్‌పోర్టుకు బయలుదేరుతారు.
సా. 5.05 బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరిక
సా. 5. 20 నుంచి 6 గంటల ఐటీసీ కాకతీయలో సమావేశం
సా. 6 గంటలకు ఇంపీరియల్ గార్డెన్‌కు బయల్దేరనున్న హోం మంత్రి
సా. 6.20 నుంచి 7.20 వరకు కొనసాగనున్న భేటీ కొనసాగనుంది.
రాత్రి 7.40 గంటలకు ఐటీసీ కాకతీయలో బీజేపీ ముఖ్యనేతలతో సమావేశం
రాత్రి 9.40 గంటలకు బేగంపేట ఎయిర్ పోర్ట్ నుంచి తిరిగి ఢిల్లీకి తిరుగు పయనం