కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ నెల 27న ఆయన తెలంగాణకు రానున్నారు. ఖమ్మంలో జరిగే బీజేపీ బహిరంగ సభలో షా పాల్గొంటారు. ఢిల్లీ నుంచి ప్రతేక విమానంలో విజయవాడకు చేరకుని.. అక్కడి నుంచి హెలికాఫ్టర్లో భద్రాచలం చేరుకుంటారని కిషన్ రెడ్డి తెలిపారు. భద్రాచలంలో శ్రీరామున్ని దర్శించుకున్న తర్వాత సభకు హాజరవుతారని చెప్పారు.
ఈ సభలో అమిత్ షా పలు కీలక ప్రకటనలు చేసే అవకాశముంది. కిషన్ రెడ్డి రాష్ట్ర బీజేపీ పగ్గాలు చేపట్టిన అనంతరం జరగనున్న తొలి సభ కావడంతో దాన్ని విజయవంతం చేసేందుకు రాష్ట్ర నాయకులు కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికల సందడి నెలకొంది. ఇప్పటికే బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించగా.. కాంగ్రెస్ ఆశావాహుల నుంచి అప్లికేషన్లను స్వీకరిస్తోంది. అయితే బీజేపీ వచ్చే నెలలో ఫస్ట్ లిస్ట్ ప్రకటించే అవకాశం ఉంది.
గత నెలలోనే అమిత్ షా తెలంగాణకు రావాల్సి ఉంది. అయితే వర్షాల వల్ల రెండు సార్లు ఆయన పర్యటన రద్దు అయ్యింది. గత నెల 15, 29న షా పర్యటనలు రద్దు అయ్యాయి. ఇక షా సభతో బీజేపీ ఎన్నికల శంఖారావం పూరించనుంది. సభలు, సమావేశాలతో ప్రజాక్షేత్రంలోకి వెళ్లేలా ప్లాన్ చేస్తోంది.