అధికారంలోకి రాగానే కేసీఆర్‌ను జైలుకు పంపిస్తాం.. అమిత్ షా
టేబుల్‌పై డబ్బులు పెట్టిన వాళ్లనే సీఎం కేసీఆర్ మంత్రులను చేస్తున్నాడని గులాబీ బాస్ పై సంచలన ఆరోపణలు చేశారు కేంద్ర హోం మంత్రి అమిత్ షా. శుక్రవారం ఆర్మూర్‌లో బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి పైడి రాకేష్ రెడ్డికి మద్దతుగా ఆయన ప్రచారం నిర్వహించారు. ఆర్మూర్‌లో నిర్వహించిన బీజేపీ సకల జనుల విజయ సంకల్ప సభ సభలో మాట్లాడుతూ.. ఇచ్చిన ఏ హామీని సీఎం కేసీఆర్ ప్రభుత్వం నెరవేర్చలేదన్నారు. పదేళ్లలో తెలంగాణను విధ్వంసం చేశారని చెప్పారు. ఆర్టీసీ స్థలాలను కూడా సీఎం కేసీఆర్ ప్రభుత్వం కబ్జా చేసిందన్నారు.
తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాగానే హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని ఇచ్చారు. బీఆర్ఎస్ పరిపాలనలో జరిగిన అవినీతి, అక్రమాలపై విచారణ జరిపి.. కేసీఆర్ ను జైలుకు పంపిస్తామని చెప్పారు. కేసీఆర్ సమయం అయిపోయిందన్నారు. పెట్రోల్ పై కేంద్రం పన్ను తగ్గిస్తే.. కేసీఆర్ సర్కారు మాత్రం పట్టించుకోలేదన్నారు. పెట్రోల్ పై కేంద్రం పన్ను తగ్గిస్తే.. కేసీఆర్ సర్కారు మాత్రం పట్టించుకోలేదన్నారు. బీసీ అభ్యర్థిని సీఎం చేస్తామన్న ఏకైక పార్టీ బీజేపీనే అని చెప్పారు. కేసీఆర్ సర్కార్ హయాంలో అవినీతి రాజ్యమేలిందని ఆరోపించారు. ముస్లీం మైనార్టీలకు ఇచ్చే 4 శాతం రిజర్వేషన్లు బడుగు, బలహీన వర్గాలకు ఇస్తామని మాట ఇచ్చారు. పేపర్ లీకేజీలతో నిరుద్యోగుల జీవితాలతో సీఎం కేసీఆర్ ఆడుకున్నారన్నారు. నిజామాబాద్‌లో బీడీ కార్మికులకు ప్రత్యేక ఆసుపత్రిని నిర్మిస్తామన్నారు. పసుపు పరిశోధనా కేంద్రాన్ని నిజామాబాద్‌లో ఏర్పాటు చేస్తామన్నారు.