Amrapali : ఆమ్రపాలికి ప్రభుత్వ శాఖలో అదనపు బాధ్యతలు

Byline :  Bharath
Update: 2024-02-04 04:12 GMT

(Amrapali)హెచ్‌ఎండీఏ ఐటీ, మూసీ రివర్‌ ఫ్రంట్‌ డెలవలప్‌మెంట్‌ ఎండీగా కొనసాగుతున్న ఆమ్రపాలి.. హైదరాబాద్‌ గ్రోత్‌ కారిడార్‌ లిమిటెడ్‌ (హెచ్‌జీసీఎల్‌) మేనేజింగ్‌ డైరెక్టర్‌, అవుటర్‌ రింగ్‌రోడ్డు ప్రాజెక్టు డైరెక్టర్‌ గా అదనపు బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ మేరకు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి, మెట్రో పాలిటన్ కమిషనర్ డాక్టర్ ఎం.దానకిషోర్ ఉత్తర్వులు జారీ చేశారు. దానకిషోర్ కూడా హెచ్ఎండీఏ కమిషనర్ గా అదనపు బాధ్యతలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ప్రత్యేకంగా ఈ నెల 6న హెచ్‌ఎండీఏపై పూర్తిస్థాయి సమీక్ష నిర్వహించనున్నట్లు తెలుస్తుంది. 




Tags:    

Similar News