చందమామ కథలు చెప్పిన తల్లికి..కూతురు ఇచ్చిన అపురూపమైన గిఫ్ట్

Update: 2023-08-26 06:08 GMT

చిన్నప్పుడు పిల్లలు మారాం చేస్తుంటే ‘‘చందమామ రావే..జాబిల్లి రావే...” అంటూ అమ్మ గోరుముద్దలు తినిపించేది. ఇలాంటి సంఘటనలు ప్రతి ఒక్కరి జీవితంలో ఓ మధుర జ్ఞాపకంగా ఎప్పటికీ నిలిచే ఉంటుంది. అయితే.. అలాంటి స్వీట్ మెమోరీలను ఇచ్చిన అమ్మకు.. ఏమి ఇచినా రుణం తీరదు. అందుకే తన తల్లికి ప్రేమగా ఓ కూతురు ఎవరూ ఊహించని అపురూపమైన గిఫ్ట్ ఇచ్చింది. అమ్మ కోసం ఏకంగా చంద్రమండలంపైనే స్థలాన్ని కొనుగోలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది.




 


పెద్దపల్లి జిల్లా గోదావరిఖని జీఎం కాలనీలో ఉంటున్న సింగరేణిలో పని చేస్తున్న రాంచందర్‌‌‌‌‌‌‌‌, వకుళాదేవిలకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. పెద్ద కూతురు సాయివిజ్ఞతకు ఖమ్మం జిల్లాకు చెందిన గోపికి పెళ్లి చేశారు. 10 ఏళ్ల క్రితమే వీరిద్దరూ అమెరికా వెళ్లారు. సాయివిజ్ఞత అమెరికాలోని ఐయోవాలో గవర్నర్‌‌‌‌‌‌‌‌ కిమ్‌‌‌‌‌‌‌‌ రెనాల్డ్స్‌‌‌‌‌ దగ్గర ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌ మేనేజర్‌‌‌‌‌‌‌‌గా, ఫైనాన్షియల్‌‌‌‌‌‌‌‌ అడ్వైజర్‌‌‌‌‌‌‌గా పనిచేస్తోంది. ఆమె భర్త గోపి వ్యవసాయానికి సంబంధించిన మ్యాన్యూఫ్యాక్చరింగ్‌‌‌‌‌‌‌‌ కంపెనీలో హెచ్‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌ హెడ్‌‌‌‌‌‌‌‌గా ఉన్నారు. సాయివిజ్ఞత ప్రతి సంవత్సరం మదర్స్ డే సందర్భంగా తన తల్లికి ఏదో ఒక బహుమతి పంపిస్తుండేది. అయితే ఈ ఏడాది తనతో కలిసి పనిచేసే కొలీగ్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్‎తో చంద్రుడిపై స్థలం కొనాలని డిసైడ్ అయ్యింది. అమెరికా ఎంబసీ ‘లూనార్‌‌‌‌‌‌‌‌ రిజిస్ట్రీ’ వెబ్‌‌‌‌‌‌‌‌సైట్‌‌లో తన తల్లి వకుళాదేవి, కూతురు ఆర్హా పేర్ల మీద ఎకరం స్థలాన్ని కొనుగోలు చేసింది. ఈ స్థలాన్ని 2022 మే లో రిజిస్ట్రేషన్ చేశారు సాయివిజ్ఞత. కాగా తాజగా వీరి పేరుపై చంద్రమండలంలో ఎకరం స్థలం కేటాయింపులు జరిగినట్టు తాజాగా డాక్యుమెంట్లు అందాయి. దీంతో సాయివిజ్ఞత కుటుంబం ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.




 


ఈ మధ్యనే సాయి విజ్ఞత అమెరికా నుంచి గోదావరిఖనికి వచ్చింది. చంద్రుడిపైకి వెళ్లే అవకాశం లేకపోయినా, తల్లిపై తనకున్న ప్రేమతోనే స్థలాన్ని కొన్నట్లు సాయివిజ్ఞత తెలిపారు. ఫ్యూచర్లో తమ కుటుంబంలో ఎవరైనా ఈ స్థలానికి చేరుకోవచ్చని ఆశాభావం వ్యక్తం చేసింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం చంద్రమండలంలో ఎకరం స్థలం రూ.35 లక్షలు పలుకుతోంది. ఇప్పటి వరకు పలువురు సెలబ్రిటీలు బాలీవుడ్‌‌‌‌‌‌‌ నటులు షారూఖ్‌‌‌‌‌‌‌‌ఖాన్‌‌‌‌‌‌‌‌, సుశాంత్‌‌‌‌‌‌‌‌ సింగ్‌‌‌‌‌‌‌‌ రాజ్‌‌‌‌‌‌‌‌పుత్‌ చంద్రమండలంలో స్థలాన్ని కొనుగోలు చేశారు.




 


Tags:    

Similar News