ఎన్నికల వేళ.. రాజాసింగ్పై మరో కేసు నమోదు

By :  Bharath
Update: 2023-11-18 01:54 GMT

బీజేపీ నేత, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పై మరో కేసు నమోదైంది. మంగళ్ హాట్ పోలీసులు తాజాగా మరో కేసు నమోదు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 14న మహారాజ్ గంజ్ లోని జరిగిన బహిరంగ సభలో విద్వేషాలు రెచ్చగొట్టారని ఆయనపై ఆరోపణలు మోపారు. ఆర్‌పి చట్టంలోని సెక్షన్ 125 కింద కేసు నమోదు చేశారు. దీనిపై మాట్లాడిన ఎస్ఐ షేక్ అస్లాం.. ముస్లింలను ఉద్దేశించి హిందీలో చేసిన ప్రసంగానికి సంబంధించిన 51 సెకన్ల వీడియో ఆధారంగా కేసు పెట్టారు. హిందూ యువతులు, లవ్ జిహాదీల మధ్య కొన్నేళ్లుగా పోరాటం జరుగుతోందని.. ఇది రెండు వర్గాల మధ్య చిచ్చు పెట్టేలా ఉందని రాజాసింగ్ ఆ మీటింగ్ లో వ్యాఖ్యానించారు. గత ఎన్నికల్లో తమ పార్టీ నుంచి ఎవరు కోవర్ట్ లుగా పని చేశారో తనకు తెలుసని, ఈ సారి అలా చేస్తే వదిలే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ఈ ఎన్నిక తనకు జీవన్మరణ సమస్య అని, దీనికోసం చావడానికైనా.. చంపడానికైనా భయపడనని సొంత పార్టీనేతలకు రాజాసింగ్ మాస్ వార్నింగ్ ఇచ్చారు. ప్రస్తుతం ఆ వాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

Tags:    

Similar News