సర్పంచ్ నవ్య, ఎమ్మెల్యే రాజయ్య ఎపిసోడ్‌లో మరో మలుపు

Update: 2023-06-27 16:32 GMT

స్టేషన్‌ఘనపూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, జానకిపురం నవ్య వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఇప్పటికే ఎమ్మెల్యేపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆధారాలు కూడా సమర్పించారు. ఓ రెండు ఆడియోలను పోలీసులకు అప్పగించారు. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. తన దగ్గర ఉన్న ఆధారాలతో మహిళ కమిషన్‌ను కలిసి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు. బుధవారం మహిళా కమిషన్‌ను కలవనున్నట్టు చెప్పారు. బెదిరింపు కాల్స్‎తో పాటు, అసభ్యకర కాల్స్ వస్తున్నట్టు తెలిపారు. తనకు ఎమ్మెల్యే రాజయ్యతో పాటు, ఎంపీపీ కవితతో ప్రాణహాని ఉందని...రక్షణ కావాలని కోరారు. తాను ఎలాంటి తప్పు చేయాలేదని..న్యాయం జరిగే వరకు పోరాడతానని స్పష్టం చేశారు. అవసరమైన సమయంలో ఎమ్మెల్యే వేధించిన ఆధారాలు బయటపెడతానని నవ్య హెచ్చరించారు.

Tags:    

Similar News