తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలకు సిద్దంగా ఉన్నామని ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ తెలిపారు. 85 ఏళ్లు నిండిన వారు హోమ్ ఓటింగ్ కోసం ఏప్రిల్ 22లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మరో మూడు రోజుల్లో హోమ్ ఓటింగ్ ఆఫ్లికేషన్ స్వీకరణ మొదలైవుతుందని సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నిక కోసం ఏర్పాట్లు పూర్తి చేశామని వెల్లడించారు. రాష్ట్రంలో మొత్తం 90 వేల పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని సీఈవో వెల్లడించారు.
ఏప్రిల్ 19న ప్రారంభం కానున్న లోక్ సభ పోలింగ్ దేశంలో ఏడు దశల్లో జరగనుంది. మరో మూడ్రోజుల్లో హోం ఓటింగ్ దరఖాస్తుల స్వీకరణ మొదలు కానుందని చెప్పారు. గతేడాది 2.09 లక్షల మంది రాష్ట్రంలో పోస్టల్, హోమ్ ఓటింగ్ జరిగిందని వెల్లడించారు. రాష్ట్రంలో 85 ఏళ్లు దాటిన ఓటర్లు 1.85 లక్షల మంది, దివ్యాంగులు 5.26 లక్షల మంది ఉన్నారని తెలిపారు. ఎలక్షన్ కోడ్ నేపథ్యంలో రూ. 50 వేల కంటే ఎక్కువ నగదు తీసుకెళ్తే సంబంధిత అధికారులకు పత్రాలు చూపించాలని సూచించారు.