Breaking News : గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమరుల్లా ఖన్ నియామకం

Update: 2024-01-25 10:19 GMT

తెలంగాణ గవర్నర్ తమిళిసై కీలక నిర్ణయం తీసుకున్నారు, టీజేఎస్‌ అధినేత కోదండరామ్,అమరుల్లా ఖాన్‌ను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నియమించారు. ఈ మేరకు రాజ్‌భవన్ ఉత్తర్వులు జారీ చేసింది. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ప్రభుత్వం వీరి పేర్లను నామినేట్ చేయగా తాజాగా గవర్నర్ ఆమోదించారు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డీ కీలక ప్రకటన చేశారు. తెలంగాణ జనసమితి అధినేత, ప్రొఫెసర్ కోదండరాంను గవర్నర్ కోటాలో చట్టసభలకు పంపుతామని చెప్పారు. తక్షణమే ఆయన్ను ఎమ్మెల్సీ చేయాల్సిన బాధ్యత తమపై ఉందని.. ఆయన లాంటి వారు సభలో ఉండాలని సీఎం అన్నారు. రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తి కావడంతో విద్యారంగం తరఫున ఆయనను ప్రతిపాదించాలనుకుంటుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో దాసోజు శ్రవణ్, కుర్ర సత్యానారాయణను ఎమ్మెల్సీగా ప్రతిపాదించగా.. గవర్నర్ పెండింగ్‌లో పెట్టారు. వారిని ఏ ప్రాతిపదికన ఎమ్మెల్సీగా నామినేట్ చేశారో చెప్పాలని గవర్నర్ అప్పటి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమంలో ప్రొఫెసర్ కోదండరాం పోషించిన పాత్ర, ప్రొఫెసర్‌గా సేవలు అందించారు




Tags:    

Similar News