వైఎస్ షర్మిల అరెస్ట్..పరిస్థితి ఉద్రిక్తతం

Update: 2023-08-20 14:03 GMT

సాగర్ ప్రధాన రహదారిపై ఉద్రిక్తత చోటుచేసుకుంది. గిరిజన మహిళ లక్ష్మికి తక్షణ న్యాయం చేయాలని కోరుతూ షర్మిల ఆందోళనకు దిగారు. దీంతో భారీగా ట్రాఫిక్ జాం అయ్యింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని వైఎస్ షర్మిలను అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు. షర్మిల అరెస్ట్‌ను పార్టీ కార్తకర్తలు అడ్డుకోవడంతో హై టెన్షన్ నెలకొంది. పోలీసులకు, పార్టీ కార్యకర్తలకు మధ్ద తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఆందోళనకారులపై పోలీసులు లాఠీఛార్జీ చేశారు. అనంతరం వైఎస్ షర్మిలను అరెస్ట్ చేశారు. అనంతరం హయత్ నగర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. షర్మిలను లోటస్ పాండ్ తరలించే అవకాశం ఉంది.

అంతకుముందు మీడియాతో మాట్లాడిన షర్మిల గిరిజన మహిళ లక్ష్మిపై పోలీసులు వ్యవహరించిన తీరుపై మండిపడ్డారు. గిరిజన మహిళ లక్ష్మిపై పోలీసుల దాడి అమానుషమన్నారు. అర్ధరాత్రి మహిళ అని చూడకుండా స్వాతంత్య్రం వచ్చిన రోజు అరాచకం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రక్షణగా ఉండాల్సిన పోలీసులు ఈ దారుణానికి పాల్పడితే స్వాతంత్రాన్ని గౌరవించినట్లా అని ప్రశ్నించారు. పోలీసుల తీరు రోడ్డుమీద రౌడీలకు, రేపిస్టులకు తేడా లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Tags:    

Similar News