Arun Ramachandra Pillai : లిక్కర్ స్కాంలో ట్విస్ట్.. అప్రూవర్గా మారడంపై పిళ్లై క్లారిటీ

Byline :  Krishna
Update: 2023-09-14 16:58 GMT

ఢిల్లీ లిక్కర్ స్కాంలో కీలక ట్విస్ట్ నెలకొంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న అరుణ్ రామచంద్ర పిళ్లై అప్రూవర్గా మారినట్లు వార్తలొచ్చాయి. ఈ వార్తలపై పిళ్లై లాయర్లు స్పందించారు.

రామచంద్ర పిళ్లై అప్రూవర్గా మారలేదని స్పష్టం చేశారు. 164 కింద ఈడీకి ఎలాంటి వాంగ్మూలం ఇవ్వలేదని చెప్పారు. ఎమ్మెల్సీ కవిత తరుపున పిళ్లై కీలకంగా వ్యవహరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో పిళ్లై అప్రూవర్గా మారినట్లు వచ్చిన వార్తలు ఆసక్తిని రేపాయి.

మరోవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఈడీ మరోసారి నోటీసులు జారీ చేసింది. శుక్రవారం విచారణకు రావాలని ఆ నోటీసుల్లో పేర్కొంది. ఈ కేసులో ఈడీ అధికారులు కవితను ఇప్పటికే మూడుసార్లు విచారించారు. కాగా ఈడీ నోటీసులపై కవిత సెటైర్ వేశారు. అది ఈడీ నోటీస్ కాదని మోదీ నోటీస్ అని అన్నారు. అది రాజకీయ కక్షతో పంపించిన నోటీసు కాబట్టి దానిపై పెద్దగా స్పందించాల్సిన అవసనం లేదని వ్యాఖ్యానించారు. ఈ నోటీసులను తమ పార్టీ న్యాయ విభాగానికి ఇచ్చామని.. వారు ఎలా చెబితే అలా మందుకెళ్తామన్నారు.

ఇప్పటికే ఈ కేసులో వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి సహా ఆయన తనయుడు మాగుంట రాఘవ, శరత్ చంద్రారెడ్డి అప్రూవర్లుగా మారారు. సౌత్ గ్రూప్లో కీలకంగా వ్యవహరించిన వీరు ఇప్పుడు అప్రూవర్లుగా మారడం గమనార్హం. అప్రూవర్లు ఇచ్చిన సమాచారంతో ఈడీ పలువురిని ప్రశ్నిస్తోంది. హైదరాబాద్ నుంచి ఢిల్లీకి నగదు బదిలీ ఎలా జరిగింది..ఎవరు చేశారు.. ఎక్కడి నుంచి ఎక్కడకు పంపించారు..? కీలకంగా వ్యవహరించింది ఎవరు..? అనే కోణంలో ఈడీ దర్యాప్తు చేస్తోంది.


Tags:    

Similar News