arun ramachandra Pillai : ఢిల్లీ లిక్కర్ స్కాం.. అప్రూవర్గా మారిన రామచంద్ర పిళ్లై
ఢిల్లీ లిక్కర్ స్కాంలో కీలక పరిణామం జరిగింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న అరుణ్ రామచంద్ర పిళ్లై అప్రూవర్గా మారారు. 164 కింద ఈడీకి వాంగ్మూలం ఇచ్చారు. కొన్నాళ్ల క్రితం రామచంద్ర పిళ్లైకు సంబంధించిన పలు ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. ఎమ్మెల్సీ కవిత తరుపున పిళ్లై కీలకంగా వ్యవహరించినట్లు ఆరోపణలు వచ్చాయి.ఈ క్రమంలో ఆయన అప్రూవర్గా మారడం ఆసక్తిని రేపుతోంది.
ఇప్పటికే ఈ కేసులో వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి సహా ఆయన తనయుడు మాగుంట రాఘవ, శరత్ చంద్రారెడ్డి అప్రూవర్లుగా మారారు. సౌత్ గ్రూప్లో కీలకంగా వ్యవహరించిన వీరు ఇప్పుడు అప్రూవర్లుగా మారడం గమనార్హం. అప్రూవర్లు ఇచ్చిన సమాచారంతో ఈడీ పలువురిని ప్రశ్నిస్తోంది. హైదరాబాద్ నుంచి ఢిల్లీకి నగదు బదిలీ ఎలా జరిగింది..ఎవరు చేశారు.. ఎక్కడి నుంచి ఎక్కడకు పంపించారు..? కీలకంగా వ్యవహరించింది ఎవరు..? అనే కోణంలో ఈడీ దర్యాప్తు చేస్తోంది.