Asaduddin Owaisi : నడిపించిన డాక్టర్లు.. కేసీఆర్ను పరామర్శించిన అసదుద్దీన్

By :  Bharath
Update: 2023-12-09 08:22 GMT

బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో జారిపడటంతో.. ఆయన ఎడమకాలి తుంటి విరిగింది. దీంతో ఆయనను హుటాహుటిన సోమాజిగుడలోని యశోద హాస్పిటల్ కు తరలిచారు. కాగా నిన్న కేసీఆర్ కు శస్త్రి చికిత్స జరిపి, హిప్ రిప్లేస్మెంట్ చేశారు. అయితే కేసీఆర్ కు చేసింది మేజర్ సర్జరీ కావడంతో మరింత పర్యవేక్షణ అవసరమని డాక్టర్లు చెప్పారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని, కోలుకోవడానికి ఇంకా ఆరు వారాల సమయం పడుతుందని డాక్టర్లు తెలిపారు. డాక్టర్లు, ఫిజియోల పర్యవేక్షణలో కేసీఆర్ వాకర్ సాయంతో నడిచారు. కేసీఆర్ చిన్న చిన్న అడుగులు వేస్తూ ముందుకు సాగారు.

మరోవైపు కేసీఆర్ త్వరగా కోలుకోవాలని అభిమానులు, రాజకీయనాయకులు కోరుకుంటున్నారు. తెలంగాణ వ్యాప్తంగా పూజలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో యశోద హాస్పిటల్ కు వెళ్లిన ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ.. కేటీఆర్ తో కలిసి కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు. కుటుంబసభ్యులను పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితి మెరుగుపడాలని వేగంగా కోలుకోవాలని ప్రార్థించారు.ఈ మేరకు అసదుద్దీన్ ట్వీట్ చేశారు.




Tags:    

Similar News