సొంతూరికి పయనమైన జనం.. సగం ఖాళీ అయిన హైదరాబాద్ నగరం..

By :  Kiran
Update: 2023-11-29 10:31 GMT

హైదరాబాద్ నగరం సగం ఖాళీ అయింది. దసరా, సంక్రాతి సమయంలోలాగే ఎన్నికల సమయంలో జనం తండోపతండాలుగా సొంతూళ్లకు బయలుదేరారు. గురువారం అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఉండటంతో ఓటు హక్కు వినియోగించుకునేందుకు చాలా మంది సొంతూరు బాట పట్టారు. రాష్ట్రంలోని పలు జిల్లాలకు చెందిన వారు చదువు, ఉద్యోగం, ఉపాధి నిమిత్తం హైదరాబాద్లో ఉంటున్నారు. వారంతా ఓటు వేసేందుకు సొంతూళ్లకు తరలివెళ్తున్నారు.

హైదరాబాద్ నుంచి జిల్లాలకు వెళ్తున్న వారితో జూబ్లీ, ఇమ్లిబన్ బస్టాండ్లు కిటకిటలాడుతున్నాయి.

ఆర్టీసీ బస్సులన్నీ ఇప్పటికే ఫుల్ కావడంతో నగర శివారు ప్రాంతాల్లోనూ ప్రైవేట్ బస్సులు, వెహికిల్స్ కోసం జనం వేచి చూస్తున్నారు. పఠాన్ చెరు, సుచిత్ర, కొంపల్లి, ఆరాంఘర్, ఉప్పల్, ఎల్బీనగర్ ప్రాంతాల్లో సొంతూళ్లకు వెళ్లేందుకు వందల సంఖ్యలో జనం పడిగాపులు పడుతున్నారు. నవంబర్ 30న పోలింగ్ సందర్భంగా కచ్చితంగా సెలవు ఇవ్వాలని ఎలక్షన్ కమిషన్ ఇప్పటికే సర్క్యులర్ జారీ చేసింది. ఒకవేళ సెలవు ఇవ్వకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. దీంతో హైదరాబాద్ సిటీలోని పెద్ద, చిన్న కంపెనీలన్నీ హాలిడే డిక్లర్ చేశాయి. దీంతో ఉద్యోగులంతా ఊరి బాట పట్టారు.




Tags:    

Similar News