టీఎస్ టెట్ అప్లికేషన్లకు బుధవారంతో గడువు ముగియనుంది. ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి అర్హత పరీక్ష అయిన టెట్ కు భారీ సంఖ్యలో దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. మంగళవారం నాటికి 2.5లక్షలకుపైగా దరఖాస్తులు వచ్చినట్టు అధికారులు ప్రకటించారు. ఈనెల 16తో గడువు ముగియనున్న నేపథ్యంలో చివరి రోజున ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పారు.
టెట్ కోసం మంగళవారం వరకు మొత్తంగా 2,50,963 అప్లికేషన్లు వచ్చాయి. వాటిలో వాటిలో 74,026 మంది పేపర్-1, 16,006 మంది అభ్యర్థులు పేపర్-2కు అప్లై చేశారు. రెండు పేపర్లూ రాసేందుకు 1,60,931 మంది దరఖాస్తు చేసుకున్నట్లు అధికారులు ప్రకటించారు. ఆగస్టు 1న టెట్ నోటిఫికేషన్ రిలీజ్ కాగా.. ఆగస్టు 2 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. సెప్టెంబర్ 15న టెట్ పరీక్ష జరగనుంది. ఉదయం పేపర్ 1, మధ్యాహ్నం పేపర్ 2 ఎగ్జామ్ నిర్వహించనున్నారు.august 16 is last date for applying ts tet