ఫ్రీ బస్ ఎఫెక్ట్.. ప్రజాభవన్ ముందు ఆటో దహనం

Byline :  Krishna
Update: 2024-02-01 14:36 GMT

తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఆటోవాలాలకు పెద్ద తలనొప్పిగా మారింది. ప్రభుత్వ నిర్ణయంతో తమకు నష్టాలు వస్తున్నాయని ఆటో డ్రైవర్లు వాపోతున్నారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు కూడా చేపట్టారు. పలుచోట్ల ఆటో కార్మికులు ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం రేపింది. ఈ క్రమంలో ప్రజాభవన్ ముందు ఓ ఆటో డ్రైవర్ చేసిన పని అందరినీ అవాక్కయ్యేలా చేసింది. ఆటోపై పెట్రోల్ పోసి నిప్పంటించి నిరసన వ్యక్తం చేశాడు.

మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన దేవా అనే ఆటో డ్రైవర్ మద్యం మత్తులో ప్రజా భవన్ ముందు తన ఆటోపై పెట్రోల్ పోసుకుని తగలబెట్టాడు. మహిళలకు ఉచిత ప్రయాణంతో తమకు ఆదాయం తగ్గపోయిందని ఆరోపిస్తూ ఆటో తగలబెట్టాడు.

Tags:    

Similar News