Auto Drivers Protest : మహిళలకు ఫ్రీ జర్నీ.. భిక్షాటన చేస్తున్న ఆటోడ్రైవర్లు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ బస్సులు మహిళలకు ఉచిత ప్రయాణాన్ని కల్పించిన నేపథ్యంలో ఆటో డ్రైవర్లు వినూత్న రీతిలో తమ నిరసన వ్యక్తం చేశారు. మేడ్చల్ లో ఆర్టీసీ బస్సుల్లో భిక్షాటన చేస్తూ నిరసన తెలిపారు. మహిళలకు ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం కల్పించడం వల్ల తమ బతుకు తెరువు కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తూ నిరసన వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన తర్వాత మొదటగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించింది. ఈ నేపథ్యంలో మహిళలు ఆటోలను ఆశ్రయించడం మానేశారు. దీంతో ఆటోల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. ఉచిత బస్సులు రావడం వల్ల తమకు ఉపాధి పోతుందని వివిధ రూపాల్లో ఆటో డ్రైవర్లు తమ నిరసన వ్యక్తం చేశారు. ఆటో డ్రైవర్ల నిరసన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వారికి ఉపాధి పోకుండా సంవత్సరానికి కొంత డబ్బును చెల్లిస్తామని హామీ ఇచ్చింది.
అయితే అది ఎప్పటి నుంచి అమలు అవుతుందో అన్న అంశంపై క్లారిటీ లేకపోవడంతో ఆటో డ్రైవర్లు నేటికీ ఆందోళనలో ఉన్నారు. తమ సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే అంశంలో భాగంగా ఆటో డ్రైవర్లు ఆర్టీసీ బస్సు ల్లో ఇలా భిక్షాటన చేస్తూ తమ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. ఆర్టీసీ బస్సుల్లో భిక్షాటన చేస్తున్న ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.