ముందస్తు బెయిల్ ఇవ్వండి.. కోర్టును ఆశ్రయించిన అజారుద్దీన్

By :  Krishna
Update: 2023-10-28 02:30 GMT

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నిధుల గోల్‌మాల్ కేసులో హెచ్‌సీఏ మాజీ అధ్యక్షుడు అజారుద్దీన్ కోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని మల్కాజ్‌గిరి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 2019-2022 మధ్యకాలంలో అజారుద్దీన్ కోట్ల రూపాయల దుర్వినియోగానికి పాల్పడ్డారని జస్టిస్ లావు నాగేశ్వరరావు కమిటీ నిర్ధారించింది. గత ఆగస్టులో హెచ్‌సీఏ నిధులపై కమిటీ నిర్వహించిన ఆడిట్‌లో ఈ విషయం వెలుగుచూసింది. దీంతో పోలీసులు ఆయనపై నాలుగు కేసులు నమోదు చేశారు.

క్రికెట్ బాల్స్, బకెట్‌కుర్చీలు, అగ్నిమాపక, జిమ్‌సామాగ్రి వంటి వస్తువుల కొనుగోలులో అవకతవకలు జరిగినట్లు కమిటీ గుర్తించింది. ప్రధానంగా క్రికెట్ బాల్స్ కొనుగోలులో భారీ అవినీతి జరిగిందని కమిటీ ఆడిట్లో తేలింది. ఒక్కో బాల్ ను రూ. 392 బదులు రూ. 1400 లకు ఆర్డర్ ఇచ్చారని, ఇలా హెచ్సీఏకు 57 లక్షలు నష్టం కలిగినట్లు కమిటీ నిర్ధారించింది. అదేవిధంగా బకెట్ చైర్స్ కొనుగోలు విషయంలోనూ 43 లక్షలు నష్టం జరిగినట్లు గుర్తించింది. ఈ క్రమంలో హెచ్సీఏ సీఈవో ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో ఈ కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని ఆయన కోర్టును ఆశ్రయించారు.


Tags:    

Similar News