Balapur Laddu Price 2023 : బాలాపూర్ లడ్డూ ఎంత పలికిందంటే..?

Byline :  Bharath
Update: 2023-09-28 05:59 GMT

ప్రతీ ఏడాది భక్తుల్లో ఆసక్తిని రేకెత్తిస్తుంటాడు బాలాపూర్ గణపయ్య. గణేష్ నవరాత్రులు అయిపోతున్నయంటే చాలు అందరి దృష్టి ఈయనపై వైపే ఉంటుంది. బాలాపూర్ లడ్డూ వేలం పాట అప్పుడే మొదలవుతుంది కాబట్టి. అనుకున్నట్లుగానే ఈసారి బాలాపూర్ లడ్డు రూ.27 లక్షల రికార్డు ధర పలికింది. తుర్కయంజాల్ కు చెందిన వ్యాపారి దాసరి దయానంద్ బాలాపూర్ లడ్డును సొంతం చేసుకున్నారు. పోయిన ఏడాది రూ.24.60 లక్షలు పలికిన బాలాపూర్ లడ్డూ.. ఈఏడాది 2లక్షల 40 వేల రూపాయలు ఎక్కువగా పలికింది. 


బాలాపూర్ లడ్డూ అంటే ఎందుకంత ప్రత్యేకం..

43ఏళ్లుగా అంటే 1980లో బాలాపూర్ గణేశుని ప్రస్ధానం మొదలైంది. 23 ఏళ్లుగా లడ్డూ వేలం పాటతో బాలాపూర్ గణేశుడికి మరింత ఖ్యాతి పెరిగింది. ఈ గణేశుని దర్శనంకోసం స్థానికులే కాకుండా వివిధ ప్రాంతా లనుంచి భక్తులు వస్తారు. గణేశుడి చేతిలో ఉన్న లడ్డూ సొంతం చేసుకుంటే సిరిసంపదలు దక్కుతాయని భక్తుల విశ్వాసం. 1994 నుంచి బాలాపూర్ లో లడ్డూ వేలం పాట మొదలుపెట్టారు. మొదట 450 రూపాయలతో ప్రారంభమైన లడ్డూ వేలం…క్రమంగా వందలు, వేలు దాటి లక్షలు దాటింది. పేద, ధనిక, రైతు, రాజకీయ నాయకులని తేడా లేకుండా అంతా వేలంపాటలో పాల్గొని తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. మొదట బాలపూర్ వాసులే వేలం పాటలో పాల్గొనేవారు.   

Tags:    

Similar News