Ads Ban : తెలంగాణలో ఇక ఆ ప్రకటనలు చేస్తే జైలుకే

Update: 2024-02-12 06:18 GMT

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటూ వెళ్తోంది. అసెంబ్లీ సమావేశాల్లో పొగాకు, సిగరెట్ ఉత్పత్తులకు సంబంధించి సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకూ సిగరెట్, పొగాకు ఉత్పత్తులకు సంబంధించి అనేక సంస్థలు ప్రకటనలు చేసేవి. దానివాల్ల వారి ఆదాయం బాగా పెరిగేది. అయితే ఆ ప్రకటనల వల్ల యువత వ్యవసనాలకు అలవాటు పడేవారు. దానికి అరికట్టేందుకు సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.

సిగరెట్, పొగాకు సంబంధిత ఉత్పత్తులు, వినియోగానికి సంబంధించిన ప్రకటనలను తెలంగాన రాష్ట్రంలో నిషేధిస్తూ చట్టాన్ని తెచ్చింది. ఈ మేరకు అసెంబ్లీలో బిల్లుకు ఆమోదం కూడా తెలిపింది. మంత్రి శ్రీధర్ బాబు ఆ బిల్లును ప్రవేశపెట్టగా ఎటువంటి చర్చా లేకుండా సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. దీంతో ఇకపై తెలంగాణలో సిగరెట్, పొగాకు సంబంధిత యాడ్స్ కనపడవు.

యువత ధూమపానానికి దూరంగా ఉండాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ సర్కార్ ఈ చట్టాన్ని తీసుకొచ్చింది. అలాగే హుక్కా సెంటర్లపై కూడా నిషేధం విధిస్తూ ప్రభుత్వం బిల్లును ప్రవేశపెట్టింది. ఆ బిల్లుకు ఆమోదం లభించింది. యువతను చెడు వ్యసనాల నుంచి కాపాడుకుని, వారిని ఉన్నత స్థితిలోకి తీసుకెళ్లడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు.


Tags:    

Similar News