నో డౌట్స్..నేను అక్కడి నుంచే పోటీ చేస్తా : బండి సంజయ్

By :  Aruna
Update: 2023-09-15 06:10 GMT

కరీంనగర్ నుంచే రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానని, ఇందులో ఎలాంటి అనుమానం లేదని బీజేపీ ఎంపీ బండి సంజయ్ మరోసారి క్లారిటీ ఇచ్చారు. ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆయన ఇకపై తన దృష్టంతా కరీంనగర్‎పైనే ఉంటుందని చెప్పారు. సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ నుంచి పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి భారీ బైక్ ర్యాలీని నిర్వహించారు. పరకాల వరకు కొనసాగే ఈ ర్యాలీని ప్రకాశ్ జావదేకర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన బండి సంజయ్ అసెంబ్లీ ఎన్నికల్లో తాను ఎక్కడి నుంచి పోటీ చేయాలనుకుంటున్నారో మరోసారి క్లారిటీ ఇచ్చారు." కరీంనగర్ నుంచే నేను పోటీ చేస్తాను. ఇందులో ఎలాంటి డౌట్ లేదు. ఇప్పటికే కరీంనగర్‎లో ఎన్నికల గ్రౌండ్ వర్క్ మొదలు పెట్టాము. డబ్బు, అధికారంతో బీఆర్ఎస్ పాలిటిక్స్ చేయాలని చూస్తోంది. మాకు పార్టీ కార్యకర్తలే కొండంత బలం"అని ఆయన చప్పారు.

Tags:    

Similar News