ఎవరికి ఎవరు కోవర్టో..అందరికీ తెలుసు.. మంత్రికి బండి కౌంటర్

Byline :  Krishna
Update: 2024-01-03 15:44 GMT

కాంగ్రెస్ మంత్రుల్లో అప్పుడే అహంభావం కన్పిస్తోందని బీజేపీ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు. కిషన్ రెడ్డి బీఆర్ఎస్ బినామీ అంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. ఎవరికి ఎవరు కోవర్టు.. ఏ పార్టీ నేతలు ఎవరితో రహస్యంగా కలుస్తున్నారో ప్రజలందరికీ తెలుసుని అన్నారు. ప్రస్తుతం కొందరు మంత్రుల తీరు బీఆర్ఎస్ నేతలు వ్యవహించిన తీరును గుర్తుకు తెస్తుందని తెలిపారు. బీఆర్ఎస్ వేర్లను కూకటివేళ్లతో పెకిలించేదాకా విశ్రమించేది లేదని స్పష్టం చేశారు.

కాంగ్రెస్కు అదృష్టం ఉండడం వల్లే అధికారంలోకి వచ్చింది తప్పా.. ఆ పార్టీ నేతలు చేసిన పోరాటాలేమీ లేవని బండి సంజయ్ ఎద్దేవా చేశారు. నిరుద్యోగులు, రైతులు, ఉద్యోగులు, మహిళల పక్షాన ఏనాడూ ఉద్యమాలు చేయలేదన్నారు. అయినా తెలంగాణ అభివృద్ధి కోసం కాంగ్రెస్కు సహకరిస్తామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి దమ్ముంటే కాళేశ్వరంపై వెంటనే విచారణ మొదలుపెట్టాలని డామండ్ చేశారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ ఎక్కడి నుంచి ఆదేశిస్తే అక్కడి నుంచి పోటీ చేస్తానని స్పష్టం చేశారు. ఈ నెల 22న అయోధ్య రాముడి ప్రతిష్టాపన మహోత్సవం జరగనుందని.. రాజకీయాలకు అతీతంగా అందరూ దీంట్లో భాగస్వాములు కావాలని కోరారు.

Tags:    

Similar News