Tablighi Jamaat Meeting: తబ్లిగీ జమాత్ సభకు రూ.2.45 కోట్లు.. సర్కార్‌పై బండి సంజయ్ ఫైర్

Byline :  Veerendra Prasad
Update: 2023-12-21 05:09 GMT

తబ్లిగీ జమాత్ సంస్థకు రాష్ట్ర సర్కారు నిధులు విడుదల చేయడంపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ ఫైర్ అయ్యారు. బలవంతపు మత మార్పిళ్లను, ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న ఇలాంటి సంస్థలకు నిధులు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. వికారాబాద్ జిల్లా పరిగి మండలంలో వచ్చే నెల జనవరి 6, 7, 8 తేదీల్లో ఇస్లామిక్ సమాజం పేరిట తబ్లిగీ జమాత్ సంస్థ ఏర్పాటు చేసిన సమావేశ ఏర్పాట్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.2 కోట్ల 45 లక్షలకు పైగా నిధులు మంజూరు చేయడం దారుణమని విమర్శించారు.

భారత దేశానికి పెను ప్రమాదంగా మారిన తబ్లిగీ జమాత్‌కు రాష్ట్ర సర్కారు నిధులివ్వడం ఆశ్చర్యం కలిగిస్తోందని బండి సంజయ్ తెలిపారు. ఓ ప్రైవేట్ సంస్థకు ఏ రకంగా ప్రభుత్వం నుంచి నిధులు విడుదల చేస్తారంటూ ప్రశ్నించారు. టెర్రరిజం, బలవంతపు మత మార్పిళ్లను ప్రోత్సహిస్తున్న ఈ సంస్థపై చర్యలు తీసుకోవాల్సింది పోయి నిధులిస్తూ ప్రోత్సహించడం ఎంత వరకు సమంజసమని బండి సంజయ్ నిలదీశారు.

తబ్లిగీ జమాత్ సంస్థకు ప్రభుత్వం నిధులు మంజూరు చేయడం వెనుక సూత్రధారులెవరో తేల్చాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. సూత్రదారులపైన కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. తక్షణమే తబ్లిగీ జమాత్ సమావేశాన్ని రద్దు చేయాలని.. లేనిపక్షంలో తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని బండి సంజయ్ హెచ్చరించారు.

Tags:    

Similar News