ప్లీజ్ ఇకనైనా ఫిర్యాదులు ఆపండి.. అసంతృప్త నేతలపై బండి ఫైర్
By : Mic Tv Desk
Update: 2023-07-21 12:37 GMT
తెలంగాణ బీజేపీ నేతలపై బండి సంజయ్ ఫైర్ అయ్యారు. రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి బాధ్యతలు చేప్పటిన అనంతరం.. కార్యక్రమంలో మాట్లాడిన బండి అసంతృప్త నేతలపై మండి పడ్డారు. రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి రావాలంటే.. నాయకులంతా కలిసి కట్టుగా పనిచేయాలని కోరారు. తను అధ్యక్షుడిగా దింపడానికి హైకమాండ్ కు ఫిర్యాదు చేసిన నేతలపై పరోక్షంగా ఫైర్ అయ్యారు. అధ్యక్షుడిగా కిషన్ రెడ్డినైనా స్వేచ్ఛగా పని చేసుకోనివ్వాలని బండి కోరారు. ఢిల్లీ వెళ్లి ఫిర్యాదులు చేయడం ఆపాలని, పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.