కాంగ్రెస్ కూటమి కుక్కలు చింపిన విస్తరిలా మారింది: బండి సంజయ్
By : Bharath
Update: 2024-01-29 08:57 GMT
లోక్ సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా బీజేపీ ఈసారి 350కిపైగా స్థానాల్లో గెలుస్తుందని, తెలంగాణలో 10కి పైగా ఎంపీ స్థానాల్లో విజయం సాధించడం ఖాయమని ఎంపీ బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. దేశానికి, తెలంగాణకు బీజేపీనే భవిష్యత్తని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ ఇండియా కూటమి కుక్కలు చింపిన విస్తరిలా మారిందని విమర్శించారు. బిహార్ లో జరుగుతున్న పరిణామాలే ఇండియా కూటమి పతనానికి కారణమని అన్నారు. కేటీఆర్ మాటలను బీఆర్ఎస్ లీడర్లు పట్టించుకోవట్లేదని బండి సంజయ్ ఎద్దేవా చేశారు. పదేళ్ల పాలనలో బీఆర్ఎస్ చేసిందేమి లేదు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేసింది. పేదలను రోడ్డుకు ఈడ్చింది. కేంద్ర ప్రభుత్వం ఎన్ని నిధులు ఇవ్వడానికైనా సిద్ధంగా ఉంది. కేటీఆర్ కు దమ్ముంటే.. గ్రామాభివృద్ధికి బీఆర్ఎస్ పార్టీ ఏం చేసిందో చెప్పాలి.