కాంగ్రెసోళ్లకు బాస్మతి బియ్యం అక్షింతలు పంపుతాం - బండి సంజయ్

Update: 2024-01-19 10:20 GMT

ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల చిరకాల వాంఛ ఈ నెల 22వ తేదీన నెరవేరబోతోందని బీజేపీ నేత బండి సంజయ్ అన్నారు. అందుకే ఆ రోజున తెలంగాణ సర్కారు ప్రభుత్వ సెలవు ప్రకటించాలని డిమాండ్ చేశారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలకు హాలీడే ఇవ్వాలని అన్నారు.

శ్రీరామ మందిరంలో రాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని రాజకీయం చేయొద్దని బండి సంజయ్ అన్నారు. శ్రీ రాముడు బీజేపీకి మాత్రమే దేవుడు కాదని, ఆయనకు రాజకీయం ఆపాదించి వివాదాస్పదం చేయడం సరికాదని హితవు పలికారు. కాంగ్రెస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలకు బండి కౌంటర్ ఇచ్చారు. ప్రజలు దేవుడి అక్షింతల కార్యక్రమంలో స్వచ్ఛందంగా పాల్గొంటున్నారని అన్నారు. రామ మందిర నిర్మాణ నిధి సేకరణలో తెలంగాణ అగ్రస్థానంలో ఉందని గుర్తు చేశారు. అక్షింతల్లో రకాలు వుండవని, రేషన్ బియ్యమని కాంగ్రెస్ నేతలు వక్రీకరించడం తగదని హితవుపలికారు. దైవ కార్యాన్ని రాజకీయం చేయడాన్ని బండి తప్పుబట్టారు. కాంగ్రెస్ వాళ్లు కోరితే బాస్మతి బియ్యం అక్షింతలు పుంపుతామని బండి సంజయ్ కోరారు.




Tags:    

Similar News