కేఏ పాల్కు, బండి సంజయ్కి ఏం తేడా లేదు: రేవంత్ రెడ్డి

Update: 2023-06-22 12:29 GMT

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పై మండి పడ్డారు. గురువారం గాంధీ భవన్ లో నిర్వహించిన ప్రెస్ మీట్ లో మాట్లాడిన రేవంత్.. బండి సంజయ్ మానసిక పరిస్థితి బాగా లేదని అన్నారు. ఏడవలేక, పట్టిన చెమటను తుడుచుకోలేక బండి ఇబ్బంది పడుతున్నారన్నారు. బండి సంజయ్, కేఏపాల్ లాగే మాట్లాడుతున్నాడని.. ఆయనపై సానుభూతి వ్యక్తం చేయడం తప్ప, ఆయన మాటలను సీరియస గా తీసుకోలేమని రేవంత్ అన్నారు.

బండి.. కాంగ్రెస్ నేతలను తమ పార్టీలోకి తీసుకుని.. చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని రేవంత్ విమర్శించారు. సంజయ్ నిరాశతో ఏం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదని దుయ్యబట్టారు. కాగా కాంగ్రెస్, బీఆర్ఎస్ లు ఒక్కటేనని.. ఎన్నికల తర్వాత రెండు పార్టీలు కలిసిపోతాయని బండి సంజయ్ అనడంలో అర్థం లేదని రేవంంత్ మండిపడ్డారు.

కమిషన్ల కోసమే ఆంధ్రా కాంట్రాక్టర్లకు:

రాష్ట్ర సాధన కోసం వందలాది మంది బలిదానం చేసుకున్న వాళ్ల గుర్తు.. అమరవీరుల స్మారక చిహ్నం. ఎంతో పవిత్రంగా నిష్టతో, బాధ్యతతో నిర్మించాల్సిందిపోయి.. రాష్ట్ర ప్రభుత్వం కమిషన్లకు కక్కుర్తి పడి ఆంధ్రా వ్యక్తికి కాంట్రాక్ట్ ఇచ్చారని రేవంత్ ఆరోపించారు. తెలంగాణను వెక్కిరించిన ఆంధ్రా కాంట్రాక్టర్లతో అమరవీరుల స్మారక చిహ్నం నిర్మించడం సీఎం కేసిఆర్ దుర్మార్గానికి నిదర్శనమని రేవంత్ మండిపడ్డారు.

Full View

Tags:    

Similar News