ఎన్నికలకు టైం దగ్గర పడుతున్న క్రమంలో రాష్ట్రంలో పార్టీలన్నీ.. తమ పావులు కదుపుతున్నాయి. పార్టీ బలోపేతానికి వ్యూహాలు రచిస్తున్నాయి. అయితే, బీజేపీ అధిష్టానం తీసుకున్న నిర్ణయాలు అందరినీ అయోమయానికి గురిచేస్తున్నాయి. తాజాగా బండి సంజయ్ ని అధ్యక్ష పదవి నుంచి తొలగించి.. కిషన్ రెడ్డికి బాధ్యతలు అప్పగించారు. పార్టీకి చేసిన సేవలకు గానూ.. బండి సంజయ్ కి కేంద్ర మంత్రి పదవి ఇవ్వనన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో మంత్రి పదవి ఇస్తామన్నా స్వీకరించేందుకు బండి అయిష్టత చూపుతున్నాడని, తనను పదవి నుంచి తొలగించడం పట్ల అసంతృప్తిగా ఉన్నట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అయితే, ప్రస్తుతం బండి ఢిల్లీలోనే ఉన్నారు.
అధిష్టానం పెద్దలతో భేటీ అయి.. తనకు వ్యతిరేకంగా పనిచేస్తున్న కొందరు నేతలను, తనతో పాటు హైకమాండ్ పై రఘునందన్ రావు చేసిన ఆరోపణలు, దానికి సంబంధించిన ఆడియో క్లిప్ తీసుకుని ఫిర్యాదు చేయనున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా.. రఘునందన్ పై చర్యలు తీసుకోవాలని సునీల్ బన్సల్ సహా పలువురు నేతలను కోరనున్నట్లు సమాచారం.