పుట్టిన రోజున అభిమానులను ఉద్దేశించి బండి సంజయ్ కీలక నోట్
బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ లెవల్ లో ఉంటుందో అందరికీ తెలిసిందే. ఆయనకు ఏం జరిగినా.. అభిమానుల వద్ద నుంచి రియాక్షన్ వేరేలా ఉంటుంది. అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత వినూత్న కార్యక్రమాలతో ప్రజల్లోకి దూసుకెళ్లారు. పార్టీ ఎదుగుదలకు కృషి చేశారు. రాష్ట్రంలో బీజేపీ గ్రాఫ్ పెరగడానికి, ఒకానొక సమయంలో బీఆర్ఎస్ ప్రత్యామ్నాయం బీజేపీనే అనడానికి కారణం బండి సంజయ్ అని విశ్లేశకులు అంటున్నారు. ఈ క్రమంలో ఆయన పుట్టిన రోజును పార్టీ నేతలు ఏ రేంజ్ లో సెలబ్రేట్ చేసుకుంటారో తెలిసిందే. అయితే, మంగళవారం (జులై 11) బండి సంజయ్ సందర్భంగా ఆయన పార్టీ కార్యకర్తలు, అభిమానులకు ట్విట్టర్ ద్వారా కీలక నోట్ విడుదల చేశారు.
‘‘ప్రజలకు, అభిమానులకు, కార్యకర్తలకు తెలియజేయునది ఏమనగా నా జన్మదినం సందర్భంగా రేపు (జులై 11, 2023) విశ్వనాథుని దర్శన నిమిత్తం నేను వారణాసి వెళ్తున్నందువల్ల మీకు అందుబాటులో ఉండలేకపోతున్నాను. నేను వచ్చిన తర్వాత మీ అందరినీ ప్రత్యక్షంగా కలుసుకుంటానని తెలియజేసుకుంటూ, ఈ అసౌకర్యానికి అన్యదా భావించవద్దని కోరుకుంటూ... మీ అభిమానం, ప్రేమ, ఆశీస్సులు ఎల్లప్పుడూ ఇలాగే నాపై కురిపించాలని ఆశిస్తున్నాను’’అని ట్వీట్ చేశారు.
ప్రజలకు, అభిమానులకు, కార్యకర్తలకు తెలియజేయునది ఏమనగా నా జన్మదినం సందర్భంగా రేపు (జులై 11, 2023) విశ్వనాథుని దర్శన నిమిత్తం నేను వారణాసి వెళ్తున్నందువల్ల మీకు అందుబాటులో ఉండలేకపోతున్నాను. నేను వచ్చిన తర్వాత మీ అందరినీ ప్రత్యక్షంగా కలుసుకుంటానని తెలియజేసుకుంటూ, ఈ అసౌకర్యానికి… pic.twitter.com/CrMWzjgDi9
— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) July 10, 2023