మా దేవతను పూడ్చిపెట్టిన వారిని వదలొద్దు.. బంజారాల నిరసన
By : Mic Tv Desk
Update: 2023-07-31 03:21 GMT
కరీంనగర్ జిల్లా మల్లాపూర్ మండలంలో బంజారాలు నిరసనకు దిగారు. తమ కులదేవతను కొందరు దుండగులు పూడ్చిపెట్టారని.. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బంజారా తండాలో ప్రజలు వారి కులదైవమైన శీతల భవానీ అమ్మవారికి నిత్యం పూజలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో కొందరు గుర్తుతెలియని దుండగులు అమ్మవారిని తొలగించి.. ఓ గుంటలో పూడ్చిపెట్టారు.
ఈ విషయం తెల్సుకున్న తండావాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. మల్లాపూర్ లోని భరతమాత కూడలివద్ద ధర్నాకు దిగారు. తమ కులదైవాన్ని పాతిపెట్టిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కొందరు వ్యక్తులు కావాలనే తమ కులాన్ని, కులదైవాన్ని కించపరిచారని ఆరోపిస్తూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. నిందితుల తగిన చర్యలు తీసుకుంటామని ఎస్సై నవీన్ కుమార్ హామీ ఇవ్వడంతో తండావాసులు ఆందోళన విరమించారు.