Cash Seized : రూ.3 కోట్లు సీజ్.. అన్నీ 500 రూపాయల కట్టలే

By :  Bharath
Update: 2023-10-10 12:37 GMT

తెలంగాణలో ఎలక్షన్ కోడ్ అమలు కావడం ఆలస్యం.. పోలీసులు అలెర్ట్ అయ్యారు(Telangana Election Code). డబ్బు, నగదు తరలింపుపై దృష్టి పెట్టిన పోలీసులు.. రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత తనిఖీలు చేపడుతున్నారు. వాహనాలను ఎక్కడికక్కడ ఆపి తనిఖీలు చేస్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ లోని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీగా నగదు పట్టుబడింది. ఎలాంటి పత్రాలు లేకుండా తరలిస్తున్న రూ.3 కోట్ల 35 లక్షల నగదును పోలీసులు పట్టుకున్నారు(3 Cr Cash Seized). పట్టుబడ్డ డబ్బుకు సంబంధించిన లెక్కలు చూపించకపోవడంతో వాటిని పోలీసులు సీజ్ చేశారు.

సోమవారం శేరిలింగంపల్లి పరిధిలోని గోపనపల్లిలో కాంగ్రెస్ నేత ఫొటోలతో పంపిణీకి రెడీగా ఉన్న రైస్ కుక్కర్లను గచ్చిబౌలి పోలీసులు సీజ్ చేశారు. ఈ ఘటనలో ఇద్దరిని అరెస్ట్ చేసి 87 కుక్కర్లను స్వాధీనం చేసుకున్నారు. వనస్థలిపురంలో రూ.4లక్షలను స్వాధీనం చేసుకున్నారు. బషీన్ బాగ్ తనిఖీల్లో కూడా భారీగా బంగారం పట్టుబడింది. ఫిల్మ్ నగర్ లో రూ.30 లక్షలను పోలీసులు సీజ్ చేశారు.

Tags:    

Similar News