Basra Triple IT : బాసర ట్రిపుల్ ఐటీలో గంజాయి కలకలం.. గంజాయి తాగుతూ పట్టుబడ్డ విద్యార్థులు
బాసర ట్రిపుల్ ఐటీలో గంజాయి పట్టుబడడం కలకలం రేపుతోంది. క్యాంపస్‌లో గంజాయి సేవిస్తున్న ఇద్దరు విద్యార్థులను సెక్యూరిటీ సిబ్బంది పట్టుకున్నారు. దీంతో హాస్టల్‌లో సోదా చేయాగా బిల్డింగ్‌పై దాచిన గంజాయి ప్యాకెట్లు లభ్యమైనవి. యూనివర్సటీలో డ్రగ్స్ ఎలా వచ్చిందో ఆరా తీయగా మహారాష్ట నుంచి విద్యార్థులు ప్యాకెట్లు రూపంలో తీసుకోచ్చినట్లు పోలీసులు వెల్లడించారు.ఈ ఘటనపై దర్యాఫ్తు కొనసాగుతోందని, పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని వివరించారు. తెలంగాణలో ప్రముఖ విద్యాలయంగా పేరొందిన బాసర ట్రిపుల్ ఐటీ క్యాంపస్ లో గంజాయి పట్టుబడడం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టిస్తోంది. ఈ ఘటనపై తోటి విద్యార్థులు, సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
స్థానికంగా కళాశాలలో డీఎస్పీ, సీఐ లతోపాటు దాదాపు 20 గా సెక్యూరిటీ సిబ్బంది భద్రత ప్రామాణాల దృష్ట్యా గస్తికాస్తుంటారు. ఇంత భద్రతా సిబ్బంది నడుమ కళాశాల లోనికి గంజాయి ఎలా వచ్చిందనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. విద్యార్థుల వద్ద నుండి గంజాయి లభ్యమవడంతో గంజాయి ఎక్కడి నుంచి వచ్చింది..? దీని వెనక ఇంకా ఎవరు ఉన్నారు..? అనే కోణంలో ఆరా తీస్తున్నారు పోలీసులు. గతంలో సెలవులపై ఇంటికి వెళ్లిన ఓ విద్యార్థి తిరిగి కళాశాలలోకి వెళ్తున్నప్పుడు స్థానిక సెక్యూరిటీ సిబ్బంది బ్యాగులు తనిఖి చేయగా అందులో సిగరెట్ ప్యాకెట్లు లభిమయ్యాయి. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు చేరవేశారు సెక్యూరిటీ సిబ్బంది. దీంతో ఆ విద్యార్థి దాదాపు 8 రోజులకు పైగా సస్పెండ్ చేసి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ జరిపించి వదిలేసినట్లు తెలుస్తుంది.