VC.Sajjanar : కారు డోర్ తీసేటప్పుడు జాగ్రత్త!..వీసీ సజ్జనార్ వీడియో వైరల్
రోడ్డు పై ప్రయాణిస్తున్నప్పడు ఏ మాత్రం ఏమరపాటుతో ఉన్నా క్షణాల్లో ప్రమాదం జరుగుతుంది. మరి ముఖ్యంగా రోడ్డుపై వాహనాలు నడిపే సమయాల్లో జాగ్రత్తగా ఉండకపోతే ప్రాణాలు గాలిలో కలిసిపోయే ప్రమాదం ఉంది. కొంచెం నిర్లక్ష్యంగా వ్యవహరించిన మనకైనా, ఇతరుల ప్రాణాలకైనా ముప్పు తెచ్చే ప్రమాదం ఉంటుంది. కారు ఉన్న వారు డోర్ తీసే టైంలో తగిన జాగ్రత్తలు పాటించాలి. రోడ్డు పై పక్కకు ఆపినప్పుడు ముందు వెనుక చూసి డోర్ తీయాలి. అలా కాకుండా సడన్ గా డోర్ తీస్తే అటుగా ప్రయాణించే వారి ప్రాణాలకు ముప్పు తెచ్చిన వారవుతారు. తాజాగా అలాంటి వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
టీఎస్ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. రోడ్ సేఫ్టీకి సంబంధించిన వీడియోలను షేర్ చేస్తూ వాహనాదారులను అప్రమత్తం చేస్తుంటారు. తాజాగా, సజ్జనార్ ఓ వీడియోను ట్విటర్ లో పోస్ట్ చేశారు. ఆ వీడియో చూస్తే.. మనంచేసే చిన్నపాటి నిర్లక్ష్యానికి ఇతరులకు ఏ స్థాయిలో ప్రమాదాన్ని తెచ్చిపెడుతుందో తెలుస్తోంది.
ఆ వీడియోలో ఓ వ్యక్తి రోడ్డు పక్కకు కారు పార్కింగ్ చేశాడు. దాని పక్కనే ఆయిల్ ట్యాంకర్ వెళ్తుంది. కారు పక్కగా బైక్ పై ఓ వ్యక్తి వెళ్తున్నాడు. ఇదే టైంలో కారులోని వ్యక్తి వెనక ముందు చూసుకోకుండా కారు డోర్ తీస్తాడు. దీంతో వెనకగా బైక్ పై వస్తున్న ఆ వ్యక్తికి..కార్ డోర్ తగిలి పక్కనే వస్తున్న ఆయిల్ ట్యాంకర్ కిందపడంతో అతని పై నుంచి ట్యాంకర్ వెళ్తుంది. అదృష్టం బాగుండి ఆ వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోపై సజ్జనార్ స్పందిస్తూ..కారు డోర్ తీసేటప్పుడు జాగ్రత్త అని సూచించారు. వెనుక నుంచి వస్తున్న వాహనదారులను గుర్తించి.. కారు డోర్ తీయండని చెప్పుకొచ్చారు. తొందరంగా వెళ్లాలనే హడావుడిలో ఇలా అజాగ్రత్త, నిర్లక్ష్యంగా వ్యవహారించి ప్రమాదాలకు కారణం కావొద్దని హెచ్చరించారు. ఎందుకంటే అందరికీ ఈ బైకర్‌లా అదృష్టం వరించదని పోస్ట్ లో సజ్జనార్ రాసుకొచ్చారు.
కారు డోర్ తీసేటప్పుడు జాగ్రత్త! వెనుక నుంచి వస్తున్న వాహనదారులను గుర్తించి.. కారు డోర్ తీయండి. తొందరంగా వెళ్లాలనే హడావుడిలో ఇలా అజాగ్రత్త, నిర్లక్ష్యంగా వ్యవహారించి ప్రమాదాలకు కారణం కాకండి. ఎందుకంటే అందరికీ ఈ బైకర్‌లా అదృష్టం వరించదు.@MORTHIndia #RoadSafety @tsrtcmdoffice… pic.twitter.com/UG8tQjjiQq
— V.C. Sajjanar, IPS (@SajjanarVC) February 13, 2024