కరీంనగర్ జిల్లాలో ఎలుగుబంటి కలకలం సృష్టించింది. రేకుర్తిలో ఎలుగుబంటి తిరుగుతున్నట్లు స్థానికులు గుర్తించారు. శనివారం తెల్లవారుజామున ఈ విషయం గమనించిన స్థానికులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. అధికారులు సీసీ కెమెరాల ఫుటేజీ పరిశీలించగా ఎలుగుబండి నడుచుకుంటూ వెళ్తున్న దృశ్యాలు కనిపించారు. ఎలుగు బంటి సంచరిస్తున్న విషయం తెలియడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు.
ఇండ్ల మధ్యలో ఉన్న చెట్ల పొదల మధ్య ఎలుగు బంటి ఉన్నట్లు ఫారెస్ట్ అధికారులు గుర్తించారు. దాన్ని పట్టుకునేందుకు చుట్టూ వలలు ఏర్పాటు చేశారు. ఎలుగుబంటిని బంధించేందుకు వరంగల్ నుంచి నిపుణుల బృందం కరీంనగర్ బయలుదేరింది.