తెలంగాణ ప్రభుత్వ అధికారులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. సెక్రటేరియట్ లో ఇవాళ జరిగిన అన్ని జిల్లాల కలెక్టర్ సమావేశంలో పాల్గొన్న ఆయన.. వారిని ఉద్దేశించి మాట్లాడారు. అధికారులు పాత పద్ధతులను మానుకుంటే మంచిదని హెచ్చరించారు. విధుల పట్ల అధికారులు అలసత్వం వహిస్తే.. ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదని తేల్చి చెప్పారు. ప్రభుత్వం అధికారులు పారదర్శకంగా, జవాబుదారీగా పనిచేయాలని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీలను తప్పక అమలు చేసిన తీసుతుందని భరోసానిచ్చారు. ఈ విషయంలో ఎలాంటి అనుమానాలు, అపోహలు పెట్టుకోవద్దని ప్రజలకు సూచించారు. అర్హులైన ప్రతీ ఒక్కరికి ప్రభుత్వం పథకాలు అందించాల్సిన బాధ్యత అధికారులదని తేల్చిచెప్పారు.