తెలంగాణ ఇంటర్మీడియెట్ బోర్డ్ కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు 5 నిమిషాలు ఆలస్యంగా వచ్చినా.. ఎగ్జామ్ హాల్ లోకి అనుమతించాలని అధికారులను ఆదేశించింది. నిమిషం ఆలస్యం నిబంధనను తొలగించాలని బోర్డ్ అధికారులకు సూచించింది. ఇప్పటి వరకు ఉదయం 9 గంటల్లోపు వచ్చిన వారిని మాత్రమే పరీక్ష కేంద్రం లోనికి అనుమతించారు అధికారులు. అయితే తాజా నిర్ణయం ప్రకారం.. ఇకపై 5 నిమిషాలు ఆలస్యంగా వచ్చినా లోనికి అనుమతించాలని ఆదేశాలు జారీ చేశారు. ఇటీవల కాలంలో నిమిషం నిబంధన తీవ్ర వ్యతిరేకతకు దారి తీసింది. ఆలస్యంగా వచ్చాడని ఎగ్జామ్ హాల్ కు అనుమతివ్వకపోవడంతో.. ఓ విద్యార్థి ఆత్మహత్య కూడా చేసుకున్నాడు. దీంతో నిమిషం నిబంధనను ఇంటర్మీడియెట్ బోర్డ్ సవరించింది.