Mallareddy : మాజీ మంత్రి మల్లారెడ్డికి బిగ్ షాక్.. కాలేజ్ రోడ్డును తొలగించిన అధికారులు
బీఆర్‌ఎస్ మాజీ మంత్రి మల్లారెడ్డికి బిగ్ షాక్ తగిలింది. హెచ్ఎండీఎ లేఅవుట్‌లో మల్లారెడ్డి వేసిన రోడ్డును అధికారులు తొలిగించారు. మేడ్చల్ జిల్లా గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని హెచ్‌ఎండీఎ లేఅవుట్‌లో 2500 గజాల స్థలం ఆక్రమంచి ఆయన సొంత కాలేజీ కోసం మల్లారెడ్డి రోడ్డు నిర్మించినట్లు గతంలో ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన ఫిర్యాదుపై మేడ్చల్ జిల్లా కలెక్టర్ దృష్టి పెట్టారు. రహదారిని తొలగించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
కలెక్టర్ ఆదేశాలతో మల్లారెడ్డి కళాశాలకు కోసం వేసిన రోడ్డును అధికారులు తొలగించారు. మల్లారెడ్డి గతంలో 2,500 గజాల భూమిని ఆక్రమించి ఈ రోడ్డును నిర్మించారు. తన కాలేజీ కోసం మల్లారెడ్డి ఈ రోడ్డును నిర్మించుకున్నారు. అయితే, ఈ వ్యవహారంపై గతంలో ఎంపీగా ఉన్న సమయంలో రేవంత్ రెడ్డి అధికారులకు ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి, రేవంత్ సీఎం అయిన తర్వాత ఈ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. మేడ్చల్ జిల్లా కలెక్టర్ ఆదేశాలతో హెచ్ఎండీఏ లేఔట్ లో మల్లారెడ్డి వేసిన రోడ్డును ఈరోజు అధికారులు తొలగించారు.