ప్రముఖ యూట్యూబర్, బిగ్‌బాస్ ఫేమ్ షణ్ముఖ్ జస్వంత్‌కు ఊరట లభించింది. డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన షణ్ముఖ్‌కు బెయిల్ మంజూరు అయింది. ప్రేమ పేరుతో తనను మోసం చేశాడంటూ షణ్ముఖ్ సోదరుడు సంపత్‌పై ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసు విషయంలో అతడిని అదుపులోకి తీసుకునేందుకు ఇంటికి వెళ్లగా అక్కడ గంజాయి లభించింది. దానితో పాటు షణ్ముఖ్ గంజాయి తాగుతూ కనిపించాడు. దీంతో అతడిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.
ఈ కేసులో తాజాగా అతడికి బెయిల్ లభించింది. జస్వంత్ తరపున న్యాయవాది కల్యాణ్ దిలీప్ సుంకర బెయిల్ అప్లై చేసి.. తనను బయటకు తీసుకొచ్చారు. కాగా ఈ విషయాన్ని లాయర్ దీలీప్ తన ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. ‘ద బాయ్ ఈజ్ అవుట్...దిసీజ్ అవర్ లీగల్ టీం వర్క్’ అని ఆ పోస్టులో రాసుకొచ్చారు. అయితే లాయర్ పోస్ట్ చేసిన ఫొటోలో షణ్ముఖ్ మాత్రమే ఉన్నాడు. ఇంకా తన సోదరుడు సంపత్ వినయ్ కి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, బెయిలుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియలేదు. ఈ కేసులో షణ్ముఖ్‌కు ఎలాంటి సంబంధం లేదని అతని తరపు లాయర్ దిలీప్ అంటున్నారు. అయితే షణ్ముఖ్‌కు జరిపిన వైద్య పరీక్షల్లో అతడు గంజాయి తీసుకున్నట్లు నిర్ధారణ జరిగినట్లు సమాచారం.