నీటి పారుదల శాఖ శ్వేతపత్రంపై ఇవాళే చర్చ పెట్టాలి : Maheshwar Reddy

Byline :  Krishna
Update: 2024-02-16 13:02 GMT

తెలంగాణ శాసనసభలో నీటి పారుదల శాఖపై శ్వేతపత్రం విడుదలపై చర్చ జరిగింది. అన్నీ పార్టీల సభ్యుల అభిప్రాయాలను స్పీకర్ గడ్డం ప్రసాద్ తెలుసుకున్నారు. ఈ క్రమంలో శ్వేత పత్రం విడుదలపై చర్చను శనివారానికి వాయిదా వేయడం కరెక్ట్ కాదని బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి అన్నారు. ఇవాళ చర్చ ఉంటుందని చెప్పి.. సడెన్గా శనివారం పెడుతామనడం ఏంటని ప్రశ్నించారు. శనివారం తమకు పార్టీ సమావేశాలు ఉన్నాయని.. ఇవాళే చర్చ పెట్టాలని కోరారు. ఒకవేళ చర్చను వాయిదా వేస్తే.. కాళేశ్వరంపై సీబీఐ విచారణకు సిద్ధంగా ఉన్నారా అనేదే తమ డిమాండ్ అని తెలిపారు. సీబీఐ విచారణకు అభ్యంతరమేంటని ఆయన అడిగారు.

మహేశ్వర్ రెడ్డి లేవనెత్తిన అంశంపై మంత్రి శ్రీధర్ బాబు సమాధానమిచ్చారు. స్పీకర్ అందరి అభిప్రాయాలు తీసుకుంటున్నారని.. చర్చను వాయిదా వేశామని సభ్యులు నిర్ణయించడం సరికాదన్నారు. అందరి అభిప్రాయాలు తీసుకున్నాక స్పీకర్ నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. బీఏసీ సమావేశంలోనే అన్నీ నిర్ణయాలు తీసుకోలేమని చెప్పారు. 

Tags:    

Similar News