Election Results 2023: తెలంగాణ ఎన్నికల్లో బీజేపీకి బిగ్ షాక్

Update: 2023-12-03 06:06 GMT

తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో బీజేపీకి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీ ముఖ్య నేతలంతా వెనుకంజలో ఉన్నారు. కరీంనగర్‌లో బండి సంజయ్‌, కోరుట్లలో ధర్మపురి అర్వింద్, దుబ్బాకలో రఘునందన్ రావు వెనకంజలో ఉన్నారు. ఈటల రాజేందర్‌కు కూడా వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. గజ్వేల్‌తో పాటు హుజూరాబాద్‌లోనూ ఈటల రాజేందర్‌ వెనుకంజలో ఉన్నారు. 119 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఇప్పటికే 61 స్థానాల్లో లీడింగ్ లో ఉంది.

తెలంగాణలో బీజేపీ మూడోస్థానంలో ఉండగా... మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌ లో ఆ పార్టీ హవా కొనసాగుతోంది. ఈ రెండు రాష్ట్రాల్లో ఆధిక్యాల్లో కమలం పార్టీ మ్యాజిక్‌ ఫిగర్‌ దాటేసింది. ఛత్తీస్‌గఢ్‌ లో మాత్రం కాంగ్రెస్‌, బీజేపీ మధ్య గట్టి పోటీ నెలకొంది. ఈ రెండు పార్టీల మధ్య క్షణక్షణానికి ఆధిక్యం మారుతోంది. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల ప్రకారం.. మధ్యప్రదేశ్‌ (మొత్తం 230 స్థానాలు)లో బీజేపీ160, కాంగ్రెస్‌ 66 చోట్ల ఆధిక్యంలో ఉంది. ఇతరులు 4 స్థానాల్లో ముందంజలో ఉన్నారు. రాజస్థాన్‌లో (మొత్తం 199 స్థానాలు) బీజేపీ109, కాంగ్రెస్‌ 74 చోట్ల ముందంజలో కొనసాగుతున్నాయి. మరో 16 చోట్ల ఇతరులు ఆధిక్యంలో ఉన్నారు.

Tags:    

Similar News