రాజ్యాంగాన్ని మార్చే సీన్ బీజేపీకి లేదు..రాహుల్ గాంధీ కామెంట్స్
బీజేపీ కేవలం హడావుడి పార్టీ అని, దేశ రాజ్యాంగాన్నే మర్చేంత ధైర్యం దానికి లేదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. ఇప్పుడు జరుగుతున్న యుద్దం కాంగ్రెస్, బీజేపీ మధ్య కాదని రెండు సిద్దంతాల మధ్య అని, ప్రజల మద్దతు నిజం మావైపు ఉన్నాయి నిరుద్యోగులకు, కార్మ కర్షకులకు ఏ తెలివి లేదని బీజేపీ నేతలు అనుకుంటారని అధికారమంతా ఒకే చోట ఉంచాలని భావిస్తారు. అధికార వికేంద్రీకరణ మా విధానం అని పేర్కొన్నారు.
మణిపుర్ నుంచి మొదలైన భారత్ జోడో న్యాయ యాత్ర మార్చి 16న సాయంత్రం ముంబయిలోని బి.ఆర్.అంబేడ్కర్ సార్మక ఛైత్యభూమికి చేరుకోవడంతో ముగిసింది. 63 రోజుల పాటు ఇది కొనసాగింది. ఈ సందర్భంగా శివాజీ పార్కులో భారీ సభ ఏర్పాటు చేశారు. భారత దేశంలో కొంతమంది కోటీశ్వరుల రుణాలు మాఫీ చేయబడ్డాయి. కానీ రైతులకు ఒక్క రూపాయి కూడా మాఫీ చేయలేదు. కొందరి వద్దే దేశ సంపద అంతా ఉంది. యువత, రైతులు, కూలీలకు అన్యాయం జరుగుతోంది’ అని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని రాహుల్ తెలిపారు. ప్రధాని మోదీ, ఆర్ఎస్ఎస్‌లు వారికే విజ్ఞానం ఉంది అన్నట్టు ప్రవర్తిస్తున్నాయని విమర్శించారు