కోమటిరెడ్డిని బుజ్జగించిన అధిష్టానం.. మైనంపల్లి, తుమ్మల చేరికలు ఖరారు!

Byline :  Bharath
Update: 2023-09-08 03:14 GMT

తెలంగాణ రాష్ట్రంలో రానున్న అసెంబ్లో ఎలక్షన్స్ లో జెండా ఎగరేయడానికి కాంగ్రెస్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. అందులో భాగంగానే సెప్టెంబర్ 17న పార్టీ అధిష్టానం ఆద్వర్యంలో బహిరంగ సభను ఏర్పాటు చేసింది. ఆ వేదికలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యే, మరో మాజీ మంత్రి సహా పలువు పార్టీలో చేరుతున్నట్లు తెలిపింది. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తో చర్చించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీకాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, ఆయన కొడుకు రోహిత్‌ల చేరిక ఖరారైంది. వీరికి మల్కాజిగిరి, మెదక్ అసెంబ్లీ స్థానాలను కేటాయించినట్లు తెలుస్తోంది. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో పార్టీ ముఖ్య నేతలు భేటీ అయిన విషయం తెలిసిందే. అయితే తుమ్మల ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేది క్లారిటీ రాలేదు. ఖమ్మం, పాలేరు కాకుండా కూకట్ పల్లి నుంచి పోటీ చేయాలని కొందరు తుమ్మలకు సూచిస్తున్నారు.




 


యెన్నంకు కాంగ్రెస్ కండువా:

ఈ క్రమంలో భువనగిరి ఎంపీ, పీసీసీ స్టార్‌ క్యాంపెయినర్‌ కోమటిరెడ్డి వెంకటరెడ్డిన పార్టీ అధిష్ఠానం బుజ్జగించింది. పార్టీలో తనకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని తనకంటే జూనియర్లను, ఎమ్మెల్యేలుగా పోటీచేసి ఓడిపోయిన వాళ్లకు పదవులు ఇస్తున్నారని కొన్నిరోజులుగా అసంతృప్తిగా ఉన్న కోమటిరెడ్డికి.. పది రోజుల్లో సముచిత స్థానం కల్పిస్తామని హామి ఇచ్చినట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో మరో కీలక నేత కాంగ్రెస్ కండువా కప్పుకుంటున్నట్లు తెలుస్తోంది. గతంలో మహబూబ్ నగర్ ఎమ్మెల్యేగా పోటీచేసి గెలుపొందిన బీజేపీ నేత యెన్నం శ్రీనివాస్ రెడ్డి కూడా సెప్టెంబర్ 17న కాంగ్రెస్ కండువా కప్పుకుంటున్నట్లు తెలుస్తోంది. కొన్నిరోజులుగా ఈయన కాంగ్రెస్ నేతలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. కాగా ఇటీవలే ఆయనను బీజేపీ సస్పెండ్ చేసింది. వీరితో పాటు మరికొందరు పార్టీలో చేరనున్నారు.




 




Tags:    

Similar News